ఏపీలో మరో రాజకీయా పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ,జనసేన,టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ,వామపక్షాలు,జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ఎన్నికల కదనరంగంలో పోటీకి సై అంటుండగా తాజాగా మరో పార్టీ పోటీకి రెడీ అంటోంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ కొత్తగా పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు విజయవాడలో సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో తటస్థంగా ఉన్న నాయకులు, మేధావి వర్గం, యువతను ఆహ్వానించారు. పేదలు, బడుగుల కోసం.. ఓ నూతన వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పార్టీ పెడుతున్నానని తెలిపారు.
విజయకుమార్ రిటైరైన తర్వాత జగన్ తన సర్కారులో విద్యాశాఖ సలహాదారుగా తీసుకున్నారు. తర్వాత ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపారు. త్వరలోనే తన పార్టీ జెండా,ఎజెండాను ప్రకటించే ఛాన్స్ ఉంది.
