Thursday, April 25, 2024
- Advertisement -

మా నాయకుడు నువ్వే..నితీశ్..!

- Advertisement -

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. నితీశ్ ఇంట్లో జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ హాజరయ్యారు.

ముఖ్యమంత్రిగా సోమవారమే నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రిగా బిజేపి నేత సుశీల్ కుమార్ మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎన్డీఏలో జేడీయూతో పాటు బిజేపి, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్​ఏఎం), వికాస్‌ శీల్ ఇన్సాన్(వీఐపీ) పార్టీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి విజయం సాధించగా.. బిజేపి 74 సీట్లతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 43 చోట్ల గెలుపొందింది. నితీశ్‌ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని తొలి నుంచి చెబుతున్న బిజేపి.. తాజాగా లాంఛనంగా ఆయనను నాయకుడిగా ఎన్నుకుంది.

ఓడిన ట్రంప్ కే భారీ మద్దతు..!

రాహుల్ పిచ్చికి శివసేన మద్దతు.. ఒబామా కామెంట్..!

బీహార్ లో ఫన్నీ.. కుటుంబంలో 18 ఓట్లు.. కానీ వచ్చింది రెండు ఓట్లు..!

బీహార్ ఎన్నికలలో ఈసీ పాత్ర..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -