- Advertisement -
అప్పులపై టీడీపీ చేసిన దుష్ప్రచారం బట్టబయలు అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ. 2,61,683 కోట్లు మాత్రమేనని స్పష్టీకరణ అయింది. వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
జూన్ 12, 2024 నాటికి రూ.5,19,192 కోట్లు అప్పు ఉన్నట్టు ప్రకటించారు. 2014-19 చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.2,57,509 కోట్లు అప్పు ఉందని తెలిపారు. 2019-24 మధ్య కాలంలో జగన్ హయాంలో చేసిన అప్పు రూ. 2,61,683 కోట్లుగా ప్రకటించారు.
కార్పొరేషన్ల ద్వారా గత ఐదేళ్లలో రూ.1,09,217 కోట్లు అప్పు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ. 3,70,900 కోట్లు గత ఐదేళ్లలో తెచ్చినట్టు ప్రకటించారు. రూ.10-14 లక్షల కోట్లు అప్పు చేసినట్టు టీడీపీ ప్రచారం చేసిందని కానీ ఇప్పుడు అదంతా డోల్లా అని తేలిపోయిందన్నారు.


