- Advertisement -

చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు!

- Advertisement -

కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అన్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఆయనకు ఎలాంటి మర్యాదలు జరిగాయి? ఇప్పుడు జైల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ చూస్తున్నారు … దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా, అసలు వ్యవసాయ శాఖ అనేది పనిచేస్తోందా? ఏ పంటకూ గిట్టుబాటు ధరలే లేవు అన్నారు కాసు మహేష్ రెడ్డి. అనుకూల పత్రికల్లో ఆహా ఓహో అని ప్రచారం తప్ప ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం కానీ, ఆదుకోవడం కానీ చేయడం లేదు. రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డా పంట నష్టం ఎంత జరిగిందనే సమీక్షే లేదు… కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు దోచుకోవడానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అన్నారు.

గురజాలలో కోడి కుంభకోణం వెలుగులోకి వచ్చింది… ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ వాళ్లు దాచేపల్లిలో చికెన్ హోల్ సేల్ షాప్స్ ను మూసివేయించి.. మార్కెట్ ధర కంటే రూ.30 అదనంగా వీళ్ళే అమ్ముతున్నారు అన్నారు. దీంతో రోజుకు రూ. 50,000కి పైగా టీడీపీ వాళ్లు దోచుకుంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఇలానే కోళ్ల కుంభకోణంకి తెరదీశారు అని మండిపడ్డారు మహేష్ రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -