- Advertisement -

వైసీపీ నేతల భార్యల ఫోన్ నెంబర్లు పోలీసులకు ఎందుకు?

- Advertisement -

మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నవంబర్ నుండి అరెస్టు చేస్తానంటూ మొరుగుతున్నావు.. నీ అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవు… అరెస్టులకు భయపడేది లేదు అని స్పష్టం చేశారు నాని.

అధికార పార్టీ నేతలను సంతృప్తి పర్చేందుకు వంశీపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు అని ఆరోపించారు. 10వ తేదీన సత్వర్థన్ కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు,11వ తేదీన 5 క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టారు అన్నారు. 12వ తేదీన సత్యవర్థన్ అన్నతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారు..ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లకు కేసుతో సంబంధం లేదు అన్నారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అన్నారు నాని.

జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో నేను లేను.. అయినా కేసు పెట్టారు అన్నారు. వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. DGPకి లేఖ రాశాను.. మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా కోర్టుకు లాగుతాను అని స్పష్టం చేశారు. వైసీపీ లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లు పోలీసులకు ఎందుకు? చెప్పాలన్నారు.

వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న నేతలు, వాళ్ల భార్యల ఫోన్ కాల్స్ ను రికార్డు చేస్తున్నారు.. రమేశ్ హాస్పటల్స్ వద్ద 17 మంది కానిస్టేబుళ్లతో వింగ్ ఏర్పాటు చేసి ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారు అన్నారు. ఖచ్చితంగా మీ తప్పులకు శిక్ష పడే రోజు వస్తుందన్నారు నాని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -