- Advertisement -

జగన్ లేకపోతే భోగాపురం ఎయిర్‌పోర్టు లేదు

- Advertisement -

జగన్ లేకపోతే భోగాపురం ఏర్పాటు ఈ రోజుకు మొదలయ్యేది కాదు అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలను ఒప్పించి 2200 ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు అని గుర్తు చేశారు.

నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి, ఇళ్లు ఇచ్చారు… 2023లో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు అని తెలిపారు. బాబూ… మీరు చేస్తున్న షోలు భోగాపురంలో ఏమాత్రం పనిచేయడం లేదు అని వ్యంగ్యంగా అన్నారు.

సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లో టీడీపీ వైఖరి చాలామందిని ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చే ముందు బందరు పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు..భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకు ఏం సంబంధం చెప్పాలని ప్రశ్నించారు. ఇతరులు చేసిన పనిని కూడా తానే చేశానని చెప్పుకోవడంలో చంద్రబాబు దిట్ట అన్నారు.

జగన్ పై చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేశౄరు..జనం గుండెల్లో వైఎస్ జగన్ స్థానం పదిలం అన్నారు.భోగాపురం ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు షో చేశారు… ప్రపంచం ముందు సిగ్గుపడేలా చేశారు..రామ్మోహన్ తీరుతో ప్రపంచం ముందు భారత్ పరువుపోయింది అని ఘాటు విమర్శలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -