వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు షాక్ తగలింది. జోగి రమేశ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. జోగి రమేశ్ పై ఫిర్యాదు చేశారు ఎస్సై రవివర్మ.
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ ,జన సమీకరణతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇబ్రహీంపట్నం పీఎస్ లో జోగి రమేశ్ పై కేసు నమోదైంది.
పోలీసుల ఫిర్యాదు ప్రకారం, జగన్ పర్యటన సమయంలో జోగి రమేష్ బైక్ ర్యాలీ నిర్వహించి, పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు, అనుమతి లేకుండా రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ స్తంభించి సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా జోగి రమేష్‌పై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
