- Advertisement -

మాజీ మంత్రి కాకాణికి పోలీసుల షాక్!

- Advertisement -

కోవూరు నియోజకవర్గంలో సంచలనం రేపిన గుమ్మళ్ళదిబ్బ మైనర్ బాలిక మృతి కేసు నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బాలిక మృతి విషయంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ కాకాణి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

బాలిక మృతదేహానికి నివాళులు అర్పించిన కాకాణి, అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

ఈ పరిణామాల మధ్య కోవూరు పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన వివరాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

కాకాణికి నోటీసులు జారీ కావడం జిల్లాలో రాజకీయంగా వేడెక్కిస్తోంది. ప్రతిపక్ష నాయకుడిపై ఒత్తిడి తేవడానికే ఈ చర్యలంటూ కొందరు ఆరోపిస్తుండగా, చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -