Friday, May 3, 2024
- Advertisement -

ప్రొద్దుటూరు..హోరాహోరి పొరేనా?

- Advertisement -

సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో ఈసారి హోరాహోరి పోరేనా?,గత రెండు ఎన్నికల్లో వైసీపీదే స్పష్టమైన ఆధిక్యం కనిపించగా ఈసారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో తలపడుతున్నారు టీడీపీ అభ్యర్థి వరదరాజులు రెడ్డి. టీడీపీ అభ్యర్థి వయస్సు 80 ఏళ్లు కాగా వీరిద్దరూ గురు శిష్యులు కూడా.

రెండుసార్లు ప్రొద్దుటూరులో వైసీపీ జెండా ఎగురవేసిన శివప్రసాద్ రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్నారు రాచమల్లు. రాష్ట్రంలో ఏ వైసీపీ ఎమ్మెల్యే చేయన్ని కార్యక్రమాలు చేశానని అందుకే తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు లక్షల ఓటర్లు ఉన్న ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలోనే లక్షా 60 వేల ఓట్లు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచారు పట్టణ ఓటర్లు. ఈసారి కూడా వైసీపీకే అండగా నిలుస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

వైసీపీ ఓడించాలంటే సీనియర్ నేత వరదరాజులు రెడ్డితోనే అవుతుందని ఆయన్ని బరిలో నిలిపారు చంద్రబాబు. అయితే టికెట్ తనకే వస్తుందని భావించిన ప్రవీణ్ రెడ్డి ఐదేళ్లుగా టీడీపీ కేడర్‌ను కాపాడుకుంటూ రాగా చివరి నిమిషంలో వరదరాజులు టికెట్ ఇవ్వడం స్థానిక టీడీపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. వరదరాజులురెడ్డి తొలిసారిగా 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన వరదరాజులురెడ్డి.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు చేతిలో ఓడిపోయారు. అభివృద్ధి, సంక్షేమమే తనను గట్టెక్కిస్తుందని రాచమల్లు ధీమాలో ఉండగా ఇవే తన చివరి ఎన్నికలని వరదరాజులు సెంటిమెంట్‌ను రాజేస్తు ముందుకు సాగుతున్నారు. మరి హోరాహోరిగా సాగుతున్న ప్రొద్దుటూరు పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -