- Advertisement -

దులీప్ ట్రోఫీకి గిల్ దూరం!

- Advertisement -

భారత జట్టు టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యం కారణంగా దులిప్ ట్రోఫీకి దురమయ్యారు. గిల్‌కు ఇటీవల రక్త పరీక్ష చేయగా అనారోగ్యంగా ఉన్నట్లు తేలడంతో ఈ నెల 28 నుండి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ నుండి తప్పుకున్నారు. 25 ఏళ్ల గిల్..ప్రస్తుతం చండీగఢ్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

2023 ప్రపంచ కప్ సమయంలో గిల్ డెంగ్యూ బారినపడి ఆస్ట్రేలియా (చెన్నై), ఆఫ్ఘానిస్తాన్ (ఢిల్లీ)తో జరిగిన భారత్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే గిల్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

దులీప్ ట్రోఫీ మధ్యలో భారత జట్టు ఆసియా కప్ 2025 కోసం యూఏఈ బయలుదేరనుండగా. సెప్టెంబర్ 5న తొలి ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. గిల్ ఆరోగ్యం ఆసియా కప్‌కి ముందే మెరుగుపడుతుందా అనే సందేహం నెలకొంది. సెప్టెంబర్ 9న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభం కానుంది. దుబాయ్, అబుధాబి వేదికలుగా ఉంటాయి. సెప్టెంబర్ 28న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించబడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -