Monday, May 20, 2024
- Advertisement -

ఇక టీడీపీకి మిగిలింది గోబెల్స్ ప్రచారమే!

- Advertisement -

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. తాను సరిగా పాట పాడలేక,మద్దెలను బాగా వాయించలేదని నిందించాడట వెనకటికి ఒకడు. ప్రస్తుతం టీడీపీ నేతల మైండ్ సెట్ చూస్తుంటే ఇదే అర్ధమవుతోంది. ఎందుకంటే గోబెల్స్‌ని మించి అబద్దాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో దిట్టగా మారిపోయారు టీడీపీ నేతలు.

సరిగ్గా నెల రోజుల క్రితమే ఏపీ సీఎం జగన్ స్పష్టం చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని..కాబట్టి ఈ 6 నెలలు అత్యంతకీలమని ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్యలోనే ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం కూడా చేశారు. బహుశా ఏ నాయకుడు కూడా ధైర్యం చేయని విధంగా ఈ సారి కొంతమంది సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడం లేదని..వారికి పార్టీలో,నామినేటేడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పిస్తామని కుండబద్దలు కొట్టేశాడు కూడా.ఇంత క్లీయర్‌గా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని రాష్ట్ర రథసారథే చెప్పిన తర్వాత టీడీపీ నేతలు కొత్తగా ముందస్తు ఎన్నికలు అంటూ బూటకపు ప్రచారానికి తెరలేపారు.

వాస్తవానికి టీడీపీ నేతలు అబద్దపు ప్రచారం చేయడం ఇదే కొత్త కాదు..అలా అని ఇక భవిష్యత్‌లో చేయరని కాదు. ఎన్టీఆర్‌ను గద్దెదించి చంద్రబాబు పదవి చేపట్టడం, తర్వాత విజన్ 2020 అంటూ ప్రజలను మోసం చేయడం అంతా ఓ కంటికి కనిపించని మాయే. ఇక 2019లో టీడీపీని వైసీపీ చిత్తుగా ఓడించిన తర్వాత ఏం చేయాలో తెలియని తెలుగుదేశం నేతలు తొలి రెండు సంవత్సరాలు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని విషపు ప్రచారం చేశారు.

ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రస్తావించడం మర్చిపోయి..జగన్‌నే టార్గెట్ చేశారు. తర్వాత ముందస్తు అంటూ ఊదరగొట్టారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేశారు. కానీ తీరా చూస్తే ఇవేమీ జరగలేదు. దీంతో మళ్లీ అబద్దాలకు తెరలేపేందుకు ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ పెద్ద కుట్రలు చేస్తోంది. ఫిబ్రవరి లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందంటూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు టీడీపీ నేతలు. కానీ ఇది ఏ విధంగా చూసిన సాధ్యపడే అంశమే కాదు.

అందుకే ఎల్లో మీడియా, చంద్రబాబు టీం చేస్తున్న విషప్రచారానికి సోషల్ మీడియాలోనే నెటిజన్లు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. టీడీపీ నేతల కళ్లు తెరిపించేలా ఉదాహరణతో సహా వివరిస్తున్నారు. మార్చి 2024 రెండో వారంలో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ముగుస్తుంది. ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని..ఇది కనీస లోకజ్ఞానం ఉండేవాడికి సైతం అర్ధం అవుతుంది..కానీ టీడీపీ నేతలకు ఎందుకు అర్ధం కావడం లేదో అని మండిపడుతున్నారు నెటిజన్లు.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీకి ప్రజల్లో ప్రాబల్యం తగ్గిపోయింది. ఇక టీడీపీ పాలనలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, అందులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ ఛార్జీషీట్‌లో పేర్కొనడం ఇలా అన్నిఅంశాలు ఆ పార్టీకి మైనస్‌గా మారాయి. ఇప్పుడు ఏపీలో ఎవరిని అడిగిన, ఏ కుంభకోణం గురించి ప్రశ్నించిన..ఆ స్కాంకు సంబంధించిన విషయాలను పూస గుచ్చినట్లు చెబుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులే లేని పరిస్థితి. అందుకే చంద్రబాబు,టీడీపీ నేతలు నాటి నుండి తమకు అచ్చొచ్చిన విషప్రచారంపైనే మళ్లీ ఆధారపడ్డారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక ఈ చంద్రబాబు భజన బ్యాచ్‌లో పవన్ కూడా చేరడంతో విడ్డూరమే అయినా అబద్దాలు, అసత్యాలతో ఎళ్లకాలం ప్రజలను మభ్యపెట్టలేని సామాన్యులు సైతం అభిప్రాయపడుతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -