- Advertisement -

టీడీపీకి స్కాంల దెబ్బ..బాబుపై మరిన్ని కేసులు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయా…?ఎక్కడా నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా స్కాంలకు పాల్పడ్డారా?, అప్పుడు అంతా మాదే ఎవరు ఏం చేయలేరన్న టీడీపీ నేతల ఓవర్‌ కాన్ఫిడెన్సే ఇప్పుడు వారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

2014 నుండి 2019 వరకు టీడీపీ సర్కార్‌లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, లిక్కర్ స్కాం, ఇసుక స్కాం ఇలా ఇప్పటివరకు వెలుగు చూడగా అన్ని కేసుల్లో చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా ఉండటంతో ఆయనపై కేసులు నమోదు చేసింది. ఇక స్కిల్ స్కాంలో ఇప్పటికే 52 రోజుల రిమాండ్‌లో చంద్రబాబు ఉండగా ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

తాజాగా నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం,కృష్ణా పుష్కరాల పనుల పేరుతో జరిగిన స్కాంపై ఏపీ సీఐడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీరు-చెట్టు, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ దర్యాప్తుకు ఆదేశించింది జగన్ సర్కార్. ఇక కృష్ణా పుష్కరాల పనులపైనా విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చంద్రబాబుపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతీ స్కాం వెలుగులోకి వస్తుండటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నికల వేళ జరుగుతున్న పరిణామాలు టీడీపీకి ప్రతికూలంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -