- Advertisement -

కేసీఆర్‌కు కష్టమేనా…ఆ ఓపినియన్ పోల్ ఏం చెప్పింది?

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల పోటీ నడుస్తోంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైన తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావాలని శక్తివంచనలేకుండా కృషి చేస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఏబీపీ సీ ఓటర్ ఓపినియన్ పోల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎన్నికల పోరు పోటాపోటీగా ఉందని తెలిపింది.

అయితే 61 స్థానాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు 43-55 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి లెక్కలతో సహా ఆధారాలను చూపించింది. ఇక ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వంపై 57% మంది ప్రజల్లో వ్యతిరేకత ఉందని వెల్లడైంది. ప్రధానంగా నిరుద్యోగ సమస్య 22.5% మేర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెకట్లు లోపాలు, స్థానిక సమస్యలు సైతం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారాయని వెల్లడిచింది.

ఎవరికి ఓటు వేయాలో 62 శాతం మంది క్లారిటీతో ఉన్నారని సర్వేలో వెల్లడికాగా తెలంగాణ వచ్చాకే అభివృద్ధి చెందిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో టగాఫ్ పోరు నడుస్తుండటంతో ప్రధాన పార్టీల నేతల్లో రైళ్లు పరుగెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -