- Advertisement -

నోబెల్ పీస్ ప్రైజ్..నార్వే ప్రధానికి ట్రంప్ లేఖ!

- Advertisement -

బహుమతి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోరేకు లేఖ రాశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి . నోబెల్ పీస్ ప్రైజ్ అందించకపోవడంతో ఇక తాను కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యతలో లేను అని, ఇకపై అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని ట్రంప్ పేర్కొన్నట్లు పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (PBS) వెల్లడించింది. ఈ లేఖలో నోబెల్ బహుమతి నిర్వహణలో నార్వే పాత్రను ప్రస్తావిస్తూ, తన విదేశాంగ విధానం, భద్రతా అవసరాలతో దీనిని ట్రంప్ అనుసంధానించారు.

ఎనిమిది యుద్ధాలను ఆపినందుకు కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంతో, ఇక నేను పూర్తిగా శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యతను అనుభవించడం లేదు. శాంతి ఎప్పటికీ ప్రధానమే కానీ, ఇప్పుడు అమెరికాకు ఏమి మంచిదో దానిపైనే ఆలోచిస్తాను అని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు. లేఖలో ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్ అధికారం ఉందా? అనే విషయాన్ని ప్రశ్నించారు. రష్యా, చైనా వంటి పెద్ద శక్తుల నుంచి ఆ ప్రాంతాన్ని డెన్మార్క్ గానీ, ప్రస్తుత భద్రతా వ్యవస్థలుగానీ రక్షించలేవని ఆయన వ్యాఖ్యానించారు. వందల ఏళ్ల క్రితం ఒక పడవ అక్కడికి చేరింది అన్నదే ఆధారం. మాకూ అక్కడ పడవలు వెళ్లాయి అని పేర్కొన్నారు.

నాటో ఏర్పాటైనప్పటి నుంచి దానికోసం తానే ఎక్కువ చేశానని ట్రంప్ చెప్పుకున్నారు. ఇప్పుడు నాటో కూడా అమెరికా కోసం ఏదో చేయాలని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌పై సంపూర్ణ నియంత్రణ లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తన పాలనలో లక్షలాది ప్రాణాలు కాపాడానని, తన నాయకత్వంలో అమెరికా సైనిక బలం పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా నిరోధక శక్తి పునరుద్ధరించబడిందని అన్నారు. చైనా, రష్యా భయపడేది, గౌరవించేది పునర్నిర్మిత అమెరికానే అని రాశారు. అలాగే నాటో మిత్రదేశాలు రక్షణ ఖర్చులు పెంచకపోవడాన్ని విమర్శించారు.

ఇదే సందర్భంలో 2009లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తన రికార్డును పోల్చారు. పదవిలోకి వచ్చిన వెంటనే ఒబామాకు బహుమతి ఇచ్చారని…“ఆయన అప్పటికి ఏమీ చేయలేదు” అంటూ ట్రంప్ ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -