- Advertisement -

జలదిగ్బందంలో విజయవాడ..పట్టించుకోని కూటమి నేతలు!

- Advertisement -

ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తుండగా విజయవాడ జలదిగ్బందంలో చిక్కుకుపోయింది. రోడ్లన్ని చెరువులను తలపిస్తుండగా వరద నీటితో పూర్తిగా జలమయమైంది భవానీపురం క్రాంబే రోడ్డు. సహాయం కోసం బాధితులు ఎదురుచూపులు చూస్తుండగా కూటమి నేతలు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

కనీసం మంచినీళ్లు, ఆహారం, పునరావాసం అందించేవరాఉ లేక వరద బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద నీటిలో బయటకు రాలేక బిల్డింగ్‌ల పైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మమ్మల్ని గాలికొదిలేసిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సహాయక చర్యల్లేవు.. కనీసం తిండి, మంచి నీరు కూడా తమకి ఇవ్వడం లేదంటూ ఓ మహిళా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రజల్ని అప్రమత్తం చేయడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని మండిపడింది.

ముఖ్యంగా సింగ్ నగర్ వాసులను అప్రమత్తం చేయకపోవడంతో వరద నీటిలో చిక్కుకున్నారు కాలనీ ప్రజలు. ప్రధానంగా మైలవరంలో ముందస్తు హెచ్చరికలు లేకుండా వెలగలేరు గేట్లు ఎత్తివేయడంతో కాలనీ మొత్తం జలయమమైంది. కొన్ని ఇళ్లలోకి నీరు కూడా చేరింది. అమరావతిలో సీడ్ యాక్స‌స్ రోడ్డు, హైకోర్టుకు వెళ్లే దారుల‌న్నీ వ‌ర‌ద నీటిలో మునిగిపోయాయి. హైకోర్టు ద‌గ్గ‌ర వ‌ర‌ద నీటిలో స్థానికులు చేప‌లు ప‌ట్టుకున్నారు. ఇక కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద నీరు చేరగా వైఎస్ జగన్ హయాంలో కట్టించిన రిటైనింగ్ వాల్‌ రక్షణ గోడగా మారడంతో లంక వాసులకి ముప్పు తప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -