రెజ్లింగ్ పోటీలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ ఎమోషన్ అయ్యారు. 2001 నుండి 2024 వరకు తన జర్నీకి సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతూనే కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్చిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు అంటూ ఎమోషన్ అయ్యారు.
భారత దేశ రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచారు వినేశ్ ఫోగాట్. అయితే అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురయ్యారు.తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. తను సిల్వర్ మెడల్ కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

1994 ఆగస్ట్ 28 న హర్యానా లో పుట్టింది వినేశ్ ఫోగాట్. 2018 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించింది . 2022, 2019 లో సీనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం గెలిచింది. 2020, 2016 లో జరిగిన ఆసియా పోటీల్లో కాంస్య మెడల్ సాధించింది. 2018, 2017, 2015 నుంచి సీనియర్ ఏషియన్ ఛాంపియన్స్ లో సిల్వర్ మెడల్ ,2022, 2018, 2014 కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది .
