- Advertisement -

రేపు అనంతపురంకు జగన్‌

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మంగళవారం) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు.

ఎమ్మెల్సీ మధుసూదన్ మరియు పామిడి వీరా కుటుంబాల వేడుకకు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్ర, అనంతపురం వైసీపీ సీనియర్ నేత పామిడి వీరా కుమార్తె, ఏడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్‌పర్సన్ బోయ లిఖితల వివాహ రిసెప్షన్ వేడుకకు జగన్ హాజరుకానున్నారు.

రేపు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి అనంతపురం చేరుకోనున్న జగన్, నేరుగా వేడుక జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు మరియు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ సీఎం పర్యటన దృష్ట్యా పామిడిలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. స్థానిక పోలీసులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -