విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకుండా టీడీపీ పోటికి దిగుతుందోన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. తన జీవితంలో తాను విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు జగన్.
ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. నైతిక విలువలు పాటిస్తే ఆ పార్టీ పోటీ పెట్టకూడదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నారని..అధర్మ యుద్ధంచేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల్లో డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని కష్టమైనా విలువలు, విశ్వసనీయతతో, వ్యక్తిత్వ విలువలతోకూడిన దారి శాశ్వతంగా ఉంటుందని చెప్పారు.ఒక నాయకుడు ఎదగాలన్నా, పెరగాలన్నా రెండు దారులు కనిపిస్తాయని, ఒక దారి సులభంగా ఉంటుందని,కాని రెండో దారి కష్టంతో కూడుకుని ఉంటుందని తెలిపిన జగన్…ఇద్దరితో మొదలైన పార్టీ పెద్ద స్థాయికి చేరుకుందని అన్నారు. తమకు 600కు పైగా ఓట్లు ఉన్నాయని..బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమన్నారు.
