ఏపీ ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉండగానే దూకుడు పెంచారు వైసీపీ అధినేత, ఎంపీ జగన్. వైనాట్ 175 పేరుతో దూసుకుపోతున్నారు జగన్. ఇందులో భాగంగా కొంతమంది సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వనని తేల్చిచెప్పిన జగన్..మరోవైపు నామినేటెడ్ పోస్టులతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఇక వైసీప వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 20 మంది సిట్టింగ్‌లకు ఎసరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్దానాల్లో గెలుపొందింది. ఇక నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి, ఒకరు జనసేన పార్టీ నుండి వైసీపీలో చేరగా నలుగురు వైసీపీకి దూరం అయ్యారు. ఇక ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు జగన్. ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో వంగా గీత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చింతా అనురాధ, మార్గాని భరత్, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలలో కొందరిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని భావిస్తున్నారు. ఇందులో బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాద రావు, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ నియోజకవర్గాల్లో ముఖ్యులకు టికెట్ ఇవ్వనున్నారు. ఇక మరికొంతమంది సీనియర్లు తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో వారికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారున్నారు. 90 శాతం సిట్టింగ్‌లకు దాదాపు టికెట్ ఖరారు మిగితా 10 శాతం మందిలో టెన్షన్ నెలకొంది. అయితే వారిని పార్టీ పోస్టులు లేదా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ద్వారా వారి సేవలను ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా రెండోసారి అధికారంలోకి రావడానికి పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు జగన్.
