రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం నివాళులర్పించారు. 76 ఏళ్ల క్రితం డాక్టర్ అంబేద్కర్ మనకు స్వేచ్ఛ, సమానతల కూడిన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆయనకు ఇవ్వగలిగే ఉత్తమ నివాళి ఆ విలువలను కాపాడుకోవడమే అన్నారు.
మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా.. అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం అన్నారు. రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా పులివెందుల నివాసంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి జగన్ మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నేతలు డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, మంగళగిరి ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, తదితరులు కార్యక్రమంలో పాల్గొని రాజ్యంగం గొప్పతనాన్ని గుర్తు చేశారు.
తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నేత మల్లారపు మధు భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ అమలు దినోత్సవం వేడుకల దేశం అంతా ఘనంగా జరుపుకుంటున్నాం. బి.ఆర్. అంబేద్కర్ చిరస్మరణీయుడు, అట్టడుగు వర్గాలు ,బలహీన వర్గాలకు రక్షణ కల్పించేలా భారత రాజ్యాంగం నిర్మించారు. బి.ఆర్.అంబేద్కర్ పూర్తి తెలివితేటలు,సమాజ అవసరాలు కలిపి రాజ్యాంగం రాయడం జరిగింది భావితరాలకు భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో సమతుల్యత చేకూరుస్తోందని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. వైయస్ఆర్సీపీ నాయకులు కార్పొరేటర్లు, పాల్గొన్నారు.
