- Advertisement -

పేదవారి సొంతింటి కలను నాశనం చేస్తారా?

- Advertisement -

పేదవారి సొంతిటి కలను నాశనం చేస్తారా అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది అని చంద్రబాబు తీరును ఎండగట్టారు.
మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్‌ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్‌లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం అని గుర్తుచేశారు జగన్.

చంద్రబాబు మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్‌ చేయించాం. ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్‌ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటే. ఇంటిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10ల‌క్ష‌లు – రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబుగారూ…, మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.

చంద్రబాబు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా…, కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ 16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారు? చెప్పాలని డిమాండ్ చేశారు జగన్. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్‌కు కూడా పిలుపునిస్తున్నా అన్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -