Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్నికల వేళ దసరా బొనాంజ..నామినేటెడ్ జాతర!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు మరో 6 నెలలు సమయం మాత్రమే ఉండగా వైనాట్ 175 లక్ష్యంతో దూసుకెళ్తున్నారు సీఎం జగన్. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలకు తోడు సంక్షేమ పథకాలతో రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమే ధీమాలో ఉన్నారు. ఇక ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తూనే మరోవైపు పార్టీలో అసమ్మతి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఇప్పటికు పలువురు సిట్టింగ్‌లకు టికెట్ రాదని చెప్పిన జగన్…వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించారు జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు మినహా మిగిలిన కార్పొరేషన్లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులకు భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

రెండు రోజుల్లో జాబితాను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందుకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు జగన్. నామినేటెడ్ పోస్టులతో ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడమే కాదు పదవి రాలేదని ఎవరూ బాధపడకుండా చూసుకోవడం ఎలా అని చర్చించారు. పార్టీ కొసం పనిచేసేవారందరికీ న్యాయం చేయగలమనే ధీమా కల్పించాలని, అలాగే కొత్తవారికి నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్ దక్కేలా కార్యచరణ సిద్ధం చేయాలని నేతలకు సూచించారు.

పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని జగన్ నిర్ణయించిన నేపథ్యంలో త్వరలోనే 15 కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నామినేటెడ్ పోస్టుల భర్తి ప్రకటన వెలువడనుంది. దసరా బొనాంజాగా నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తి నేపథ్యంలో ఆశావాహులు తగ గాడ్ ఫాదర్‌ల ద్వారా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -