- Advertisement -

క్రైస్తవులు, ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు..

- Advertisement -

క్రైస్తవులు, ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం జగన్. క్రైస్తవులకు ఆరాధ్యమైన లెంట్ ప్రారంభం, ముస్లింల పవిత్ర రంజాన్ నెల ఒకే రోజు ప్రారంభం కావడం ఆధ్యాత్మిక సమానత్వానికి అద్భుతమైన నిదర్శనమని పేర్కొన్నారు. భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ మన సమాజం ఐక్యతతో, పరస్పర గౌరవంతో ముందుకు సాగుతుందనే సందేశాన్ని ఈ సందర్భం ఇస్తుందని అన్నారు.

లెంట్ కాలంలో క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రార్థనలు, ఉపవాసాలు, ఆత్మపరిశీలనతో ఆధ్యాత్మికంగా మరింత బలపడాలని ఆకాంక్షించారు. అలాగే రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉపవాసాలు, నమాజులు, దానధర్మాలు ఆచరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని అభిలషించారు.

ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నిండాలని, సమాజంలో ప్రేమ, శాంతి, సౌహార్దం వర్ధిల్లాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. పరస్పర గౌరవం, సహనంతో పండుగలను జరుపుకోవడం ద్వారా దేశ సమైక్యత మరింత బలపడుతుందని ఆయన అన్నారు. ఈ పవిత్ర కాలం అందరికీ ఆధ్యాత్మిక శాంతి, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -