ఏపీకి ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ కావాలన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. లోక్సభలో మాట్లాడిన మిథున్ రెడ్డి… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీ.. హోదాతో సరిపోదని ఈ విషయంలో కేంద్రం ఆలోచించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై లోక్ సభలో గళమెత్తారు మిథున్ రెడ్డి.
ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయని కానీ ఇప్పుడు మాట తప్పడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టి తప్పు చేశారన్నారు. దీని ఫలితంగా కాఫర్ డ్యామ్ దాటుకుని డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు.
. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, ఈ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేశారు. విశాఖపట్నం మెట్రో స్టేటస్ ఏంటని, ఏపీలో సూపర్ 6 హామీలు ఇచ్చారని, అవి సారీ 6 గా మారకూడదని చెప్పారు.ఏపీలో శాంతిభద్రతల పరిస్థితులు ఇలా ఉంటే, రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
