మీటూ, కాస్టింగ్ కౌచ్ ఉద్యమాలు సినీ పరిశ్రమను కుదిపేశాయి. సినీ పరిశ్రమలో వేధింపులు మాములే అని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బహిరంగానే చెప్పారు. కొందరు హీరోయిన్స్ అయితే ఆ వేధింపులు ఎవరు చేశారో కూడా చెప్పేస్తున్నారు. కొందరు హీరోయిన్ అనోసరంగా అవకాశాలు పొగొట్టుకోవడం ఎందుకు అని దాచేస్తున్నారు. అయితే ఈ వేధింపులు అనేది కేవలం సినీ పరిశ్రమలోనే కాదు ప్రతి రంగంలోనూ ఉంది. తాజాగా ఈ విషయంపై స్టార్ హీరోయిన్ స్పందించారు.
తాను నటించిన చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఒక స్పెషల్ కార్యక్రమానికి హాజరైన అనుష్కా దీనిపై తన అభిప్రాయాలను తెలియజేసారు. ‘మీటూ’ మరియు ‘కాస్టింగ్ కౌచ్’లు కేవలం ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదని ప్రతీ రంగంలో ఉన్న ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదని అనుష్క అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ లో ఇది లేదని చెప్పడం లేదని నావరకైతే ఈ సమస్య ఎప్పుడు ఎదురుకాలేదని తెలిపింది. ఎందుకంటే నేను ముక్కుసూటిగా నిజాయతీగా ఉంటాను కాబట్టి అవి నాదాకా రాలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఒక మహిళ నుండి వేరే రకమైన బెనిఫిట్స్ ఆశించడం తప్పని అలాంటివి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది.
మహిళలు ఏ రంగంలోనైనా నిలబడి కీర్తి పొందాలంటే సులభ మార్గం కఠినమైన మార్గం రెండూ ఉంటాయని నేను కఠిన మార్గాన్నే ఎంచుకున్నానని పేర్కొన్నారు. ఇలాంటి వాటికి ‘నో’ అని చెప్పడం నేర్చుకుంటేనే పురుషులు స్త్రీలను గౌరవించడం ప్రారంభిస్తారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక అనుష్క ప్రస్తుతం మాధవన్ తో కలిసి నిశ్శబ్దం సినిమాలో నటించింది. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా అనుష్కకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.
