Wednesday, May 15, 2024
- Advertisement -

శాత‌క‌ర్ణి సినిమాలో పెద్ద మైనస్ ఇదే!

- Advertisement -
big minus in satakarni

బాలకృష్ణ ఫ్యాన్స్ దేశం మీసం తిప్పుతున్నారు. అఖండ భార‌తావ‌ని జ‌య‌హో శాత‌క‌ర్ణి అని కీర్తిస్తోంది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీమియ‌ర్ షో అలా ప‌డిందో లేదో జై బాలయ్య… జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగుతున్నాయి. అమరావతిని పరిపాలించిన శాతకర్ణి జీవిత కథ ఆధారంగా కథను నమ్ముకుని సినిమా తీసే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

బేన్‍ఫిట్ షో చూసిన ఫ్యాన్స్ మరోసారి బాలయ్యే సంక్రాతి హీరో అంటున్నారు. నంద‌మూరి, బాల‌య్య అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం బాలకృష్ణ కేరీర్‌లోనే శాత‌క‌ర్ణి ఓ మ‌ర‌పురాని సినిమా అవుతుందని కీర్తిస్తున్నారు. శాతకర్ణి సినిమాకు డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయట. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఈ సినిమాలో గౌరవం దక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక చిత్రంలో ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్, బాల‌య్య యాక్ష‌న్ హైలెట్ అయ్యాయి.

ఈ చిత్రం చూసిన ప్రేక్ష‌కులు ఓ విష‌యంలో మాత్రం చాలా లోటుగా ఫీల్ అవుతున్నారు. సినిమా ర‌న్ టైం చాలా త‌క్కువుగా..ఉంద‌ని సినిమా ఇంకా ఉంటే బాగుండేద‌ని చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. హిస్టారిక‌ల్ స్టోరీతో ఉన్న సినిమాల నిడివి త‌క్కువుగా ఉండ‌డం స‌హ‌జం. అయితే శాతకర్ణి సినిమాను చాలా తక్కువ రన్ టైంలో గ్రిప్పింగ్‌తో బోరింగ్ లేకుండా తీసిన విధానానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో బాలయ్య నటనకు ఎవరూ సాటిరారని చెబుతున్నారు. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయని అన్నారు. ఇక టాలీవుడ్ హిస్ట‌రీలో ఈ చిత్రం ఓ చరిత్ర సృష్టిస్తుందంటున్నారు.

Related

  1. గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ!
  2. శాతకర్ణి సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!
  3. శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!
  4. ఖైదీ, శాతకర్ణి సినిమాల ప్లసులు, మైనస్‌లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -