‘పెళ్ళాం ఊరెళితే’ ఈ మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. శ్రీకాంత్, వేణు, సునీల్ హీరోలుగా నటించిన ఈ మూవీలో నటి జ్యోతి ఓ పాత్ర పోషించింది. ఈ మూవీలో పెళ్లాం ఊరెళ్లితే వారింటికి వెళ్లే క్యారెక్టర్ జ్యోతిది. ఈ సినిమా తర్వాత మంచి పాపులర్ అయిన జ్యోతి ఇప్పుడు బిగ్‌బాస్ షోలో ఓ పార్టిసిపెంట్. ఈ క్రమంలో తన సినీ కెరీర్‌పై ఆమె స్పందిస్తూ ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో నేను చేసిన పాత్రతో నన్ను అందరూ అపార్థం చేసుకున్నారు. పెళ్లాం ఊరిళితే జ్యోతి ఎంట్రీ ఇస్తుందనే జనాల మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది.
ఎవరి పెళ్లాం ఊరెళ్లినా వాళ్లింటికి నేను వెళ్లిపోతాననుకున్నారు. జనాలు నన్ను అలా ఊహించుకోవడం చాలా బాధగా అనిపించింది. ఈ పాత్ర నుంచి బయటపడటానికి నెగిటివ్ రోల్స్, కామెడీ రోల్స్ చేయాల్సి వచ్చిందన్నారు. అదేసమయంలో తల్లిదండ్రుల అండ లేకపోయే సరికి నేను ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కానీ, నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త నట్టేట ముంచాడు. పెళ్లి తర్వాత 9 నెలలకే బాబు పుట్టాడు. ఆ బాబు గురించి ఆలోచిస్తూ నా భర్తతో చిన్న చిన్న గొడవలు రావడంతో మళ్లీ హైదరాaబాద్‌కు వచ్చేశాను. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా హైదరాబాద్‌కు వచ్చిన నాకు ఏం చేయాలో తెలియలేదు.
ఈ క్రమంలో ఇల్లు దొరక్క.. అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను. నేను చేయని తప్పుకు నా జీవితాన్ని చించిన విస్తరాకులా చేసేశారు. కానీ నా బలం ఏంటంటే నా కొడుకు. ఈ జీవితమే వద్దనుకున్న నాకు కొడుకు రూపంలో దేవుడు బుద్ది చెప్పాడు. అందుకే వాడి కోసమే బతుకుతున్నా. ఎందుకంటే నేను, నా భర్త చేసిన తప్పుకు వాడు అనాథలా మారకూడదు. అని నటి జ్యోతి తెలిపింది.
