Wednesday, May 15, 2024
- Advertisement -

శ్రీదేవి హత్య వెనుక దావూద్?

- Advertisement -

నటి శ్రీదేవి మర‌ణించి చాలకాల‌మైనా ఆమె గురించి నిత్యం వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి.ఆమె మ‌ర‌ణంపై అనుమానాలు అలానే ఉన్నాయి.ఆమె సహజంగానే మరణించారా..? లేక ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి చంపారా..? అనేది ఇప్ప‌టికి తెలియ‌లేదు.శ్రీదేవి మరణంపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సునీల్‌ సింగ్‌ అనే నిర్మాత వేసిన పిటిషన్‌లో ఈ సంచలన వివరాలున్నాయి. శ్రీదేవి మృతిలో దర్యాప్తు అవసరం లేదని అప్పట్లోనే సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

అయితే శ్రీదేవి మ‌ర‌ణపై మ‌రో కొత్త వాద‌న బ‌య‌టికి వ‌చ్చింది.శ్రీదేవి మ‌ర‌ణించింది దుబాయ్‌లోనే. దుబాయ్ అంటే మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అడ్డా.శ్రీదేవి మ‌ర‌ణంలో దావూద్ పాత్ర ఉండ‌వ‌చ్చ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.దుబాయ్‌లో దర్యాప్తును ప్రభావితం చేయగల శ‌క్తి దావుద్‌కు ఉంద‌ని, అక్క‌డ వారు అత‌ని కోసం ప‌ని చేస్తార‌ని అరి వేద్‌ భూషణ్‌ అనే రిటైర్డ్‌ ఏసీపీ అభిప్రాయపడ్డారు. ‘శ్రీదేవి మరణించింది దుబాయ్‌ హోటల్‌ జుమైరా టవర్స్‌లో.జుమైరా టవర్స్‌ దావూద్‌ ఇబ్రహీందే కావ‌డంతో శ్రీదేవి మ‌ర‌ణంలో దావుద్ పాత్ర‌పై అనుమానాలు వ‌స్తున్నాయి.

సునీల్‌ సింగ్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం శ్రీదేవి పేరిట రూ.240 కోట్లకు ఓ జీవిత బీమా పాలసీని ఒమాన్‌లో తీసుకున్నారు. దాని కోస‌మే ఆమెను హ‌త్య చేసి ఉంటార‌ని వేద్‌ భూషణ్ అనుమానం.ఆమె రక్తపరీక్ష నమూనాల ఆధారాల పరిశీలనకు నేను దుబాయ్‌ పోలీసులకు దరఖాస్తు చేస్తే, వారు నాకు పోస్ట్‌ మార్టం రిపోర్టు కాపీని మాత్రమే ఇచ్చి మిగిలిన వివరాలు వెల్లడించడానికి నిరాకరించారని వేద్‌ భూషణ్‌ వివరించారు.

https://www.youtube.com/watch?v=Xz9mrDd42dU

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -