- Advertisement -
ముంబైలో గోవింద ఆసుపత్రిలో చేరిన తర్వాత మొదటి సారిగా స్పందించారు నటుడు గోవింద. తాను బాగున్నానని తెలిపారు. నవంబర్ 11 రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో గోవింద ఆకస్మికంగా మూర్ఛపోయారు.
ఆయనను రాత్రి 1 గంటకు ముంబైలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్‌కి తరలించారు.తనకు తల తిరుగుతోందని, అయోమయం అనిపిస్తోందని చెప్పిన తర్వాతే ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్‌పై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆసుపత్రిలో చేరిన తర్వాత గోవింద తన అభిమానుల కోసం వాయిస్ మెసేజ్ పంపారు. నేను బాగున్నాను….వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని తెలిపారు. గోవింద ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు… మధ్యాహ్నం 12 గంటల సమయంలో డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు అన్నారు.
