- Advertisement -

‘నాన్నకు ప్రేమతో‘ చివరి 45 నిమిషాలు హైలైట్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిరోగా, రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‍గా తెరకేక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో‘. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలీష్ లుక్ లో కనిపించబోతున్నాడు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

దేవి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జనవరి 13 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా  ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతుంది. ఎన్టీఆర్ అభిమానుల అంచనాలు అందుకునే విధంగా సుకుమార్ ఈ సినిమా తెరకేక్కించినట్లు సమాచారం. 

ఐతే తాజాగా ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు ఆడియన్స్ బాగా అలరించబోతుందని సమాచారం. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్న ‘నాన్నకు ప్రేమతో‘ చిత్రంపై కొంచెం క్రేజ్ ఎక్కువగానే ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సొంతం చేసుకుంటదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -