లోకేశ్ కనగరాజ్… ప్రస్తుతం అల్లు అర్జున్‌తో AA23 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ‘ఖైదీ 2’ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతోందని, మరికొందరు పూర్తిగా రద్దు చేశారని కూడా ప్రచారం చేశారు.
అయితే, తాజాగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు–నటుడు లోకేశ్ కనగరాజ్ ఈ వార్తలకు స్పష్టత ఇచ్చారు. AA23 పూర్తయ్యాక వెంటనే తన తదుపరి సినిమా ‘ఖైదీ 2’నే అని ఆయన తేల్చిచెప్పారు.గతంలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్ కలిసి నటించే ఒక సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉందని, కానీ ఆ కథ తన అంచనాలకు సరిపోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని తెలిపారు. అలాగే ఆ సమయంలో కార్తి మరో సినిమాకు డేట్లు ఇచ్చేయడంతో ‘ఖైదీ 2’ ప్రారంభం కాలేకపోయిందని వివరించారు.
‘ఖైదీ 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తగా మారింది. లోకేశ్ ప్రణాళికల ప్రకారం అన్నీ సవ్యంగా సాగితే, ఈ సినిమా 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో, సూర్య ప్రధాన పాత్రలో రోలెక్స్ పాత్ర ఆధారంగా ఒక ప్రత్యేక (స్టాండ్అలోన్) సినిమా కూడా తన ప్లాన్‌లో ఉందని లోకేశ్ కనగరాజ్ వెల్లడించారు.
