- Advertisement -
భరత్ అను నేను సినిమాతో హిట్ కొట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు.ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ తన తరువాత సినిమాకు రెడీ అవుతున్నాడు.వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మహేష్ కెరీర్‌లో 25వ కావడం విశేషం.అయితే ఈ సినిమా కోసం ఫస్ట్ టైం గెడ్డం,మీసంతో కనిపించనున్నాడు.
ఇప్పటికే మహేష్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ వార్త వినబడుతుంది.మహేష్ తన 25వ సినిమాలో ఎంబీఏ స్టూడెంట్‌గా కనిపిస్తాడని సమాచారం.దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో,మహేష్ సరసన పూజ హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది.
