గతేడాది విడుదల అయిన బాహుబలి సినిమా ఎంత పెద్ద సంచలనమో తెలిసిన విషయమే. ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ ఖలాఖండం ఇప్పటికీ విదేశాల్లో రన్ అవుతూనే ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక గర్వించదగ్గ సినిమా వెళ్ళడం ఆ సినిమా భారత దేశం లో ఉన్న అన్ని రికార్డులనీ ఊడ్చేయడం అతి పెద్ద సంచలనం.
బాహుబలి సృష్టించిన విధ్వ్హంసం మరవక ముందరే జక్కన్న బాహుబలి 2 షూటింగ్ కి సిద్దం అయిపోయాడు. అయితే బాహుబలి మొదటి భాగం లో పీకీ రికార్డులు దాటలకేపోయారు నిర్మాతలు. టోటల్ గా 304 కోట్ల షేర్ తో ఎవ్వరూ అందుకోలేన౦త ఎత్తులో ఉంది బాహుబలి.
కానీ టోటల్ గ్రాస్ విషయంలో మాత్రం అమీర్ ఖాన్ పీకే(741 కోట్లు)-సల్మాన్ ఖాన్(భజరంగీ భాయ్ జాన్ 615 కోట్లు) తరువాత 590 కోట్లతో మూడో ప్లేస్ లో నిలిచింది. కాగా ఇప్పుడు చైనాలో సుమారు 6000 కి పైగా థియేటర్ లలో రిలీజ్ కాబోతున్న బాహుబలి అక్కడ సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇండియాలో నెంబర్ వన్ అవుతుంది.
ఆమిర్ ఖాన్ సినిమా అక్కడ 120 కోట్లు షేర్ ని రాబట్టి కొత్త రికార్డు గా మారింది ఇప్పుడు భారీ అంచలాన మధ్యలో బాహుబలి చైనా లో సంచలనాలకి సిద్దం అవుతోంది అనీ ఈ రకంగా ఆమిర్ ఖాన్ కి జక్కన్న ఎసరు పెట్టబోతున్నారు అనీ అంటున్నారు.
