పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో రత్నాపూర్ కి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రత్నాపూర్ కే పోలీస్ ఆఫీసర్ గా పవన్ వస్తాడని ఇప్పటికే ట్రైలర్ లో చెప్పేశారు.
ఛత్తీస్ ఘడ్ బోర్డర్ లో ఈ స్టోరీ నడిచినా.. నిజానికి ఈ రత్నాపూర్ సెట్ ని హైద్రాబాద్ లోనే వేసేశారు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పడిన కష్టాన్ని.. సర్దార్ గబ్బర్ సింగ్ డైరీస్ 4లో వివరించింది యూనిట్. ఇంతకు ముందు గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి సెట్ వేసిన ప్లేస్‌లోనే ఈ సర్దార్ సినిమాకి సంబంధించి రత్నాపూర్ సెట్ ని కూడా వేయడం విశేషం. ఓ పాతబంగ్లా పరిసరాలను ఎంపిక చేసుకుని దాని చుట్టూ ఈ సెట్ నిర్మాణం జరిగింది.
ఈ ప్రాంతాన్ని చదును చేసేందుకు 350 ట్రక్కుల మట్టిని ఉపయోగించారు. దాదాపు 500 మంది పనివారు కష్టపడి 45 రోజుల్లోనే రత్నాపూర్ ని నిర్మించేయడం విశేషం. ఈ సినిమాకి పవన్ కథ తో పాటు కథనం కూడా అందించాడు. అలాగే ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి… షూటింగ్ కి అవసరమైన అన్ని ప్రాంతాలను తనే సృష్టించేశాడు.
అక్కడ ఉన్న చెట్లకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా.. కనీసం ఒక కొమ్మను కూడా నరకకుండా.. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో ఈ సెట్ నిర్మాణం జరగడం విశేషం. ఈ విషయంలో ఒక్క మొక్కను కూడా ముట్టుకోవడానికి వీల్లేదని పవన్ నుంచి ముందే స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ వచ్చాయట. ఈ రత్నాపూర్ సెట్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు.
