ICC T20 World Cupలో అభిషేక్ శర్మ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతను ఆటలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని కుంబ్లే పేర్కొన్నారు.
ఈ టోర్నీలో భారత్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన 52వ మ్యాచ్‌లో 196 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఐదు వికెట్ల తేడాతో చేజ్ చేసి విజయం సాధించింది. జట్టు సమిష్టి ప్రదర్శనతో గెలిచినప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. గత మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన అతను ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లో కేవలం 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అభిషేక్ శర్మలో ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. ఇతరులు ఒత్తిడిని తీసుకోవాలని చూస్తున్నాడు. భారత్ గెలిచింది కాబట్టి ఇప్పుడు తాను కూడా జట్టుకు సహకరించాలి అనే భావన వస్తుంది. ఇంగ్లాండ్ వేరే సవాలు విసురుతుంది అన్నారు.
ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డూప్లెసిస్ కూడా మాట్లాడారు. జట్టు గెలవడం అతనికి మంచిది. ఓడిపోయి ఉంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు సెమీఫైనల్లో ఎలా రాణిస్తాడో చూడాలి అని వ్యాఖ్యానించారు.
