- Advertisement -

హైకోర్టులో ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వానికి ఊర‌ట‌…దిన‌క‌ర‌న్‌కు ఎదురుదెబ్బ‌

- Advertisement -

తమిళనాడులో రాజకీయం మారుతోంది. అన్నాడీఎంకె టికెట్‌పై గెలిచి టీటీవి దినకరన్ వైపు వెళ్లిన 18మంది ఎమ్మెల్యేలను మద్రాస్ హైకోర్టు అనర్హులుగా ప్రకటించింది. ఈ తీర‌పు ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వానికి ఊర‌ట‌నివ్వ‌గా దిన‌క‌రన్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం, ఎమ్మెల్యేలంతా పదవీచ్యుతులేనని తెలిపింది.

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మరో ఆరు నెలల్లో ఉపఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పళని స్వామి స్పష్టం చేశారు. అమ్మ ఆశీస్సులతో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని పళని స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పుపై దినకరన్ సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంలో సవాల్ చేయవచ్చునని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకె గనుక ఎక్కువ స్థానాలు గెలుచుకోకపోతే పళనిస్వామి ప్రభుత్వానికి మళ్లీ ముప్పు తప్పదనే చెప్పాలి. దినకరన్ లేదా డీఎంకె ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోగలిగితే తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం మారే అవకాశాలు లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -