ఏపీలో గ్రేహౌండ్స్ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించింది. విజయవాడ ఆటోనగర్లోని ఓ బిల్డింగ్ లో 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో మావోయిస్టు టాప్ క్యాడర్ ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా డైరీ ఆధారంగా మావోయిస్టులను గుర్తించారు.
లొంగుబాటు దిశలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండగా ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పారి తిరుపతి లొంగుబాటు కానున్నట్లు తెలుస్తోంది.
షెల్టర్ ఇచ్చిన మహిళ దొరకడంతో విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.
ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టుల చీఫ్ దేవ్‌జీ? కూడా ఉన్నట్లు చేస్తోంది. విజయవాడలో దొరికినవారు గెరిల్లా ఆర్మీకి చెందినవారు కావడంతో అనుమానాలు
బలపడుతున్నాయి.
విజయవాడ న్యూఆటోనగర్‌లో పట్టుబడిన 27 మందిలో 9 మంది మావోయిస్టు అగ్ర నేత దేవ్‌జీకి రక్షణగార్డులు అని తేల్చారు పోలీసులు. మిగతావారంతా మావోయిస్టు పార్టీ కేడర్ అని చెప్పారు పోలీసులు.
