- Advertisement -

కోట్లు ఖర్చు పెట్టినా కూడా… బాబు అసంతృప్తి!

- Advertisement -

ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమాచారం అందించడంలో తమ వాళ్లు విఫలం అయ్యారని భావిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాము అధికారంలోకి వచ్చాకా ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొచ్చామని..

అయితే వీటి గురించి ప్రజలకు సరిగా తెలియడం లేదని బాబు అసంతృప్తితో ఉన్నారు. ఈ పథకాల గురించి ప్రజలకు సమాచారం చేరవేయాల్సిన నేతలు, పార్టీ ప్రతినిధులు ఆ పని చేయడం లేదని బాబు అంటున్నారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పథకాల గురించి, అమలు చేసిన అంశాల గురించి ప్రజలకు తెలియలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు.

తమ పార్టీ నేతల ముందే బాబు ఈ అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. ఈ విషయంలో మరింతగా కష్టపడాలని.. ప్రజలకు తాము అమలు పెట్టిన పథకాల గురించి తెలియజేయాలని ఆయన అంటున్నాడు. ఈ విషయంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగా కష్టపడడం లేదని కూడా బాబు వ్యాఖ్యానిస్తున్నాడు. మరి ఒకవైపు ప్రచారం అంటూ కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు.

ప్రభుత్వ పథకాల అమలు ను పెద్ద ఎత్తున చేస్తున్నామని అంటూ బాబు తన ఇమేజ్ ను పెంచుకోవడం ప్రజాధనాన్నే వినియోగిస్తూ ప్రచారం చేసుకొంటున్నారు. ఆంధ్రలోని ఏ ఆర్టీసీ బస్సుమీద చూసినా బాబే కనిపిస్తున్నారు. ఏ హోర్డింగులో చూసినా తెలుగుదేశం అధినేతే ఉంటున్నాడు. మరి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రచారం విషయంలో ఇంకా అసంతృప్తే ఉందట. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీల విషయంలో కూడా సరైన ప్రచారంలేకపోయిందని బాబు భావిస్తున్నారట. అయితే ఆ పథకాల లబ్ధిదారులే ఉంటే.. ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదు కదా. లబ్ధి పొందన వారు సంతృఫ్తి పడితే అంతకన్నా ప్రచారం లేదు కదా. అలాంటి లబ్ధిదారులు లేకపోతేనే ఇలా ప్రచారం కోసం తపిస్తారు కాబోలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -