సిమ్లా కు సీఎం వైఎస్ జగన్.. కారణం అదేనా..?

- Advertisement -

నిత్యం సంక్షేమ పథకాలు.. సమావేశాలు, రివ్యూల పేరుతో బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదు రోజులపాటు వీటికి దూరంగా గడపనున్నారు. సీఎం అయన తరువాత ఆయన తన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండి.. కుటుంబానికి సమయం కేటాయించాలని నిర్ణయించారు. వారితో సంతోషంగా గడపాలని డిసైడ్ అయ్యారు.

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో ఒంటి గంటకు చండీగఢ్ బయలుదేరుతారు. సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. ఈ నెల 28న జగన్ 25వ పెళ్లి రోజు నేపథ్యంలో అక్కడే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటారు. తిరిగి ఈ నెల 30 లేదంటే 31న పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకుంటారు.

Also Read: వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీలోకి న‌రాల స‌త్య‌నారాయ‌ణ‌

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -