- Advertisement -

జ‌గ‌న్ దెబ్బ‌కు రాజీనామా చేసిన‌ పరకాల

- Advertisement -

నిన్న‌(సోమ‌వారం) తూర్పు గోదావ‌రిలో వైఎస్ జ‌గ‌న్ చేసిన కామెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ప‌ని చేస్తుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీతో యుద్ధం అంటారు ప‌క్క‌నే బీజేపీ మంత్రి భ‌ర్త‌ను కుర్చోబెంటుకుంటార‌ని అని పరకాల ప్రభాకర్‌ను ఉద్దేశించి తీవ్ర వాఖ్య‌లు చేశారు జ‌గ‌న్.

తన రాజీనామా లేఖను పరకాల ప్రభాకర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.తాను కొనసాగడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -