Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్…. మాజీ ఎమ్మేల్యేపై సీబీఐ విచారణ…?

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిన టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరో వైపు భాజాపా వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది.అక్రమ మైనింగ్ జరిగిందని సీఐడీ ఇచ్చిన నివేదిక ద్వారా అర్థమవుతుందని కోర్టు తెలిపింది. నివేదికలో ఆంధ్రా బ్యాంకులో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు తెలిపింది. అయితే దీనిపై సీబీఐ విచారణకు వెళ్లే నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికి వదిలేసింది.

యరపతి కేసులో హైకోర్టుకు మైనింగ్ నివేదిక ఇచ్చిన సీబీఐ. యరపతినేని బ్యాంకు లావాదేవీల్లో అనుమానాలున్నాయన్న కోర్టు తెలిపింది. గత కొంతకాలంగా యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. యరపతినేని శ్రీనివాసరావుపై ఈడీ విచారణ చేయాల్సిన అవసరం కూడ ఉందని హైకోర్టు చెప్పింది. అంతేకాదు యరపతినేని శ్రీనివాసరావు బ్యాంకు లావాదేవీలపై కూడ అనేక అనుమానాలను హైకోర్టు వ్యక్తం చేసింది.

ఏపీలో ఎన్నికలు ముగిశాక ఆయన అడ్రాస్ లేకుండా పోయారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ యరపతినేని ఎక్కడా కనిపించలేదు. ఎన్నికల తర్వాత ఊహించని పరిస్థితులు రావడంతో… ఆయన సైలెంట్ అయ్యారని సమాచారం.తెరవెనుక ఉండి ఎవరెవరు ఈ స్కాంను నడిపించారన్న దానిపై కూడా వివరాలు రాబట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -