బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 70 మంది సజీవదహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బంగ్లా రాజధాని ఢాకాలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 10.40 సమయంలో ఢాకాలోని చౌక్‌బజార్ అపార్ట్‌మెంట్‌లోని రసాయనాల గోదాములో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించడంతో పాటు మరో నాలుగు భవనాలకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో సుమారు 70 మంది మరణించారని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం…70 మంది సజీవదహనం
- Advertisement -
- Tags
- Crime News
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
