- Advertisement -

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్యక్రమం

- Advertisement -

ఉబ్బస రోగులకు ప్రతి ఏటా పంపిణీ చేసే చేప మందు ప్రసాదాన్ని  జూన్ 8న పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

జూన్ 8 వ తేది ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఆ మర్నాడు అంటే తొమ్మిదో తేది ఉదయం ఎనిమిదిన్నర వరకూ చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథగౌడ్ తెలిపారు. 1845 సంవత్సరం నుంచి తమ వంశస్తులు ఈ చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని, దేశ విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి ఈ ప్రసాదాన్ని తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు ప్రసాదాన్ని పొందలేక పోతే మూడు రోజుల పాటు దూద్ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

చేప మందు ప్రసాదం తీసుకునే వారు మూడు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోరాదని, మందు వేసుకున్న గంటన్నర వరకూ కూడా ఎలాంటి ఆహారం తీసుకోరాదని ఆయన చెప్పారు.  మందు వేసుకున్న వారు 40 రోజుల పాటు పథ్యం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి, ఈటెల రాజేందర్ ఎంతో సహకరిస్తున్నారన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -