Sunday, May 5, 2024
- Advertisement -

అప్పు తీసుకున్న వారు ఇక సేఫ్..!

- Advertisement -

రుణ యాప్‌ల నిర్వాహకుల ఆటలు కట్టించేలా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లోన్‌ యాప్‌లు బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. యాప్‌ల తొలగింపునకు ప్లేస్టోర్లను సంప్రదించాలని డీజీపీకి హైకోర్టు నిర్దేశం చేసింది. న్యాయవాది కల్యాణ్ దీప్ దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.

చైనా లోన్‌ యాప్‌ల వేధింపులతో రుణాలు పొందినవాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. రుణ యాప్‌ల నిర్వాహకుల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

వేధింపులపై నివేదిక సమర్పించాలని డీజీపీతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -