- Advertisement -

మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసిపై కేసు

- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యకు సంబంధించిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.మల్లెపల్లి వద్ద లావణ్య కారుతో వెళ్తుండగా ఒక బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

అయితే అప్రమత్తమైన గ్రామస్తులు కారును అడ్డుకుని నిలిపివేశారు.కారును ఆపిన గ్రామస్తులతో లావణ్య వాగ్వాదానికి దిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో పాజిటివ్ రావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు.కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరమని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -