Sunday, May 5, 2024
- Advertisement -

ఉగ్ర కుట్ర.. దేశంలో కేంద్రం హైలెర్ట్

- Advertisement -

దేశవ్యాప్తంగా కేంద్రం హైఅలెర్ట్ ప్రకటించింది. కశ్మీర్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో తనిఖీలకు సిద్ధమైంది. అన్ని ఎయిర్ పోర్ట్ ల్లో సందర్శకులను నిషేధించింది. పాకిస్తాన్ భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలు తెంపుకున్న దరిమిలా దేశంలోకి పాక్ ఆర్మీ పెద్ద ఎత్తున లష్కరే, జైషే మహ్మద్ ఉగ్రవాదులను పంపుతున్నారని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కొద్ది సేపటి క్రితమే కేంద్రాన్ని హెచ్చరించింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిధులను సమకూర్చి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో అంతర్జాతీయ ఉగ్రవాద మసూద్ అజార్ సోదరుడి నేతృత్వంలో ఉగ్రవాదులు కాచుకుకూర్చున్నా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా కశ్మీర్ లో సైనాన్ని అప్రమత్తం చేసింది. పెద్ద ఎత్తున తనిఖీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ బలగాలు జమ్మూ-కశ్మీర్ మధ్యనున్న 250 కి.మీల పరిధిలో ప్రతీ కిలోమీటర్ కు ఒక చెక్ పోస్టును ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాయి.

ఇక పీవోకే చుట్టు ఉన్న లఢఖ్ ప్రాంతాల్లో సైన్యాన్ని పెంచింది. ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

ఇక ముంబై నగరంలో కూడా ఉగ్రవాద దాడి జరిగే అవకాశాలున్నాయని ఐబీ హెచ్చరించినట్టు సమాచారం. అక్కడ కూడా ఇప్పుడు హైఅలెర్ట్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దేశంలో భారీ విధ్వంసానికి పాక్ ఉగ్రవాదులు కుట్ర పన్నారని తెలియడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను, సైన్యాన్ని అప్రమత్తం చేసింది. కాగా పాకిస్తాన్ తాజాగా తన గగనతలాన్ని మూసి వేసి నిషేధించింది. దీంతో ఇండియన్ ఎయిర్ లెన్స్ విమానాలు పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్లడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -