- Advertisement -

అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు అట‌కెక్కిన‌ట్లే….

- Advertisement -

తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు చంద్రుల్ల‌కు షాకింగ్ వార్తేన‌ని చెప్పాలి. నియేజ‌క వ‌ర్గాల‌పెంపుపై (Assembly seat hike) ఇద్ద‌రు సీఎంలు పెట్టుకున్న అశ‌ల‌పై కేంద్రం మ‌రోసారి కొర్రీ వేసింది. దాదాపు ఈ బిల్లు అట‌కెక్కిన‌ట్లే. రేప‌ట‌నుంచి జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో దీనిపై అల‌సు చ‌ర్చించ‌లేదు. దీంతో ఇద్ద‌రి సీఎంల‌కు ఇబ్బందులు త‌ప్పేట‌ట్టులేవు.
తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ ఆప‌రేష‌ణ్ ఆక‌ర్శ్‌ను ప్రారంబించింది. ఒ విధంగా స‌క్సెస్ సాధించింది.కేసీఆర్ దెబ్బ‌కు కాంగ్రెస్ పార్టీనుంచి కొంత‌మంది టీఆర్ ఎస్‌లో చేరారు.కాని టీడీపీ ప‌రిస్థితి మ‌రీ దారునం.ఆ పార్టీ తెలంగాణాలో ఖాలీ అయ్యింద‌నే చెప్పాలి.ఏకంగా టీఆర్ఎస్‌లో విలీనం చేయాల‌ని స్పీక‌ర్‌కు లేఖ ఇచ్చారు.ఇదంతా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి నియేజ‌క వ‌ర్గాల పెంపు ఉంటుంద‌నే ధీమాతో.
ఏపీలో కూడా చంద్ర‌బాబు నాయుడు నిస్సిగ్గుగా రాజ‌కీయ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డారు. ప్ర‌తిప‌క్షంగా వైసీపీని లేకుండా చేయాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఆయినా కూడా పార్టీనుంచి 18 మంది ఎమ్మెల్యేలు ప‌చ్చ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ప‌దువులు,భ‌య‌పెట్టి,ఇత‌ర తాయిలాల ఆశ‌చూపించి పిరాయింపుల‌కు తెర‌లేపాడు. 2019 ఎన్నిక‌ల్లో నియేజ‌క వ‌ర్గాల పెంపు ఉంటుంద‌ని పెట్టుకున్న ఆశ‌లు ఇప్పుడు అవిరయ్యాయి.
రేపటినుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం ముగిసిన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో 10, లోక్ సభలో 8 బిల్లులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇంకేముంది ఈసారి నియేజ‌క వ‌ర్గాల బిల్లు లేన‌ట్లే.
పార్టీ పిరాయింపుల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాబుకు ఇక చుక్క‌లు క‌నిపించ‌డం కాయం. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల‌కు,పార్టీ నాయ‌కుల‌కు నియేజ‌క వ‌ర్గాల్లో ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే బ‌గ్గుమంటోంది. నియేజక వ‌ర్గాల పెంపు జ‌రిగితేనే చంద్ర‌బాబు దీని నుంచి గ‌ట్టెక్కుతారు.లేకుంటే తాను తీసిన గోతిలో తానా ప‌డ‌తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -