Monday, May 13, 2024
- Advertisement -

సంప్రదాయబద్దంగా జగన్..బూట్లు వేసుకొని.. ఎడమచేత్తో హరతి ఇచ్చిన బాబు!

- Advertisement -

అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ పుష్కర స్నానం చేశాడు.. ఇటు ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ పుష్కరస్నానం చేశాడు. మరి.. బాబుగారి పుష్కరస్నానంపలువివాదాలకుకారణం అయ్యింది.

కుటుంబ సమేతంగా తొలిముహూర్తంలోనే బాబుగారు పుష్కరస్నానం చేశారు. అయితే బాబుగారు మూడు గంటల సేపు పుష్కర స్నానం చేశారు. ఏదో షార్ట్ ఫిలిం షూటింగ్ కు అంటూ మూడుగంటల సేపు ఆయన పుష్కరఘాట్ లోనే ఉన్నారు.

వీఐపీ ఘాట్ లో స్నానం చేయాల్సిన ఆయన ఇలా సామాన్యులు ఉన్నఘాట్ లోకి వచ్చి మకాం పెట్టే సరికి.. అప్పటికే వేచి ఉన్నభక్తుల్లో అసహనం పెరిగింది. ఫలితంగా ఘోర దుర్ఘటన జరిగింది. తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి బాబుగారి వల్లనే వారి మరణాలునమోదు అయ్యాయని.. అంత సేపు వేచి ఉండేలా చేయడమే తొక్కిసలాటకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక బాబు ఆయన తనయుడు లోకేష్ లు బట్టలు వేసుకొనే పుష్కరస్నానం చేశారు.

సాధారణంగా మగావళ్లు ఎవరూ అలా స్నానాలు చేయరు. కానీ నారా ఫ్యామిలీ జెంట్స్ మాత్రం షర్ట్స్ తోనే స్నానం చేశారు. చంద్రబాబు అయితేకనీసం బూట్లను కూడా విప్పలేదని తెలుస్తోంది. ఇక ఎడమ చేత్తో హారతి ఇచ్చారనేది మరో ఆరోపణ. అసలుగోదారికి హారతి ఇచ్చే సంప్రదాయమేలేదు. బాబుఉన్నఫలంగా దాన్ని తీసుకొచ్చారు. మోడీని అనుకరిస్తూ దాన్ని తెచ్చారు. దాన్నికూడా ఎడమచేత్తో ఇచ్చారట. మరి ఇవన్నీ పుష్కర స్నానంలో బాబుపై వస్తున్న విమర్శలు. 

ఇక జగన్ మెడలో శిలువ వేసుకొన్నాడని తెలుగుదేశం అభిమానులు ఆరోపిస్తూ మతం కోణం లాగి విధ్వేషాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నా.. జగన్ పుష్కరస్నానం అయితే సంప్రదాయబద్ధంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా తన తండ్రికి , తాతలకు పిండ ప్రదానం చేశాడుజగన్ మోహన్ రెడ్డి. ఇదీ.. జగన్ , బాబుల పుష్కర స్నానాలకు ఉన్నతేడా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -