- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే బొజ్జలకు షాక్

- Advertisement -

డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి చెన్నై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. జనసేన కార్యకర్తగా ఉన్న డ్రైవర్ రాయుడు హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించిన చెన్నై పోలీసులు, త్వరలోనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని విచారించనున్నట్లు సమాచారం.

దర్యాప్తులో భాగంగా లభించిన సెల్ఫీ వీడియో ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా మారింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనను ప్రలోభపెట్టారని డ్రైవర్ రాయుడు స్పష్టంగా పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. జనసేన మాజీ నేత కోట వినుత దంపతులను హతమార్చి, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనే స్కెచ్ రూపొందించారని రాయుడు వీడియోలో వివరించినట్లు సమాచారం.

ఈ ప్లాన్‌ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడు, టీడీపీ కార్యకర్త సుజిత్ రెడ్డితో కలిసి రాయుడు సిద్ధం చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకు గాను రూ.30 లక్షల నగదు ఇవ్వాలని ఒప్పందం జరిగిందని కూడా సెల్ఫీ వీడియోలో రాయుడు వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్ సోదరుల సహకారం కూడా ఉందన్న అనుమానంతో ఇప్పటికే పేట చంద్రను చెన్నై పోలీసులు విచారించారు.

తాజాగా ఈరోజు మరికొంత మందిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక రాయుడు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా కీలక ఆధారంగా మారింది. ఇదే సమయంలో కోట వినుత తనపై జరిగిన రాజకీయ కుట్రలో కొట్టే సాయి ప్రసాద్ కీలక వ్యక్తి అని వెల్లడించడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -