Thursday, May 9, 2024
- Advertisement -

బిర్యానీ అక్ర‌మ సంబంధం..పిల్ల‌ల‌కు విష‌మిచ్చి చంపిత త‌ల్లి …భ‌ర్త‌నూ..?

- Advertisement -

అక్ర‌మ సంబంధం వ్యామోహంలో ప‌డి త‌న ఇద్దరి పిల్లల్లకు విషమిచ్చి చంపిన కిరాత‌కురాలు అభిరామిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రియుడి వ్యామోహంలో ప‌డి పిల్ల‌ల‌తో పాటు భ‌ర్త‌ను చంపాల‌నుకున్నా వీలుకానందున ఇద్దరి పిల్లల్లను క‌ర్క‌షంగా చ‌పిం చివ‌ర‌కు క‌ట‌క‌టాల పాల‌య్యింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే…చెన్నై కుండ్రత్తూరు సమీపంలోగల మూండ్రాంకట్టలైకు చెందిన విజయ్‌ భార్య ప్రియుడిపై మోజుతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి ప్రియుడితో పరారైన విషయం తెలిసిందే. భర్త కార్యాలయంలో పని నిమిత్తం అక్కడే ఉండిపోవడంతో ఈ హత్య నుంచి తప్పించుకున్నాడు.

చెన్నై కుండ్రత్తూరు సమీపంలోగల మూండ్రాంకట్టలైకు చెందిన విజయ్‌ భార్య ప్రియుడిపై మోజుతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి ప్రియుడితో పరారైన విషయం తెలిసిందే. భర్త కార్యాలయంలో పని నిమిత్తం అక్కడే ఉండిపోవడంతో ఈ హత్య నుంచి తప్పించుకున్నాడు.

భర్త విజయ్ కుమార్ ను చంపేందుకు కూడా నిర్ణయించుకున్న ఆమె, పాలల్లో విషం కలిపి సిద్ధంగా ఉంచుకున్నప్పటికీ, విజయ్ కుమార్ రాలేదని, దీంతో తెల్లవారుజామున ఆమె ప్రియుడితో కలసి పారిపోయిందని పోలీసులు తెలిపారు

పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి అభిరామి తన ప్రియుడు బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడు సుందరం ఇంటికి వెళ్లింది. అక్కడ సుందరం ఆమెను కన్యాకుమారికి వెళ్లమని, తాను అక్కడికి వచ్చి కలుసుకుంటానని తెలిపాడు. తామిద్దరం వివాహం చేసుకుని కాపురం చేద్దామని పేర్కొన్నాడు.

దీంతో అభిరామి కోయంబేడు బస్టాండ్‌ నుంచి బస్సు ఎక్కించిన సుందరం కున్రత్తూరుకు చేరుకున్నాడు. ఇలా ఉండగా పోలీసులు కున్రత్తూరులో తన ఇంట్లో ఉన్న సుందరాన్ని అరెస్టు చేశారు. సుందరంతో ఆమెకు కాల్ చేయించి, నాగర్ కోవిల్ బస్టాండు వద్దకు రప్పించి అరెస్ట్ చేశామని తెలిపారు.

పోలీసుల విచారణలో తన భర్త సరిగా ఇంటికి రాడని, అంతేకాకుండా తనను అనుమానించేవాడని తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పేర్కొంది. ఇలా ఉండగా తనకు బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారిందని తెలిపారు. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్‌ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకునే దాన్నని తెలిపింది. దీంతో భర్త అనుమానించడంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -